Ticker

hello

SSC CGL Recruitment 2021 Study material , Syllabus , Preparation Plan | Shine india 360 Blog

SSC CGL NOTIFICATION 2021 SHINE INDIA 360 BLOG

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సిజిఎల్) పరీక్ష 2020 గ్రూప్ బి మరియు సి లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రచురించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు..ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి నిర్దిష్టమైన ప్రణాలిక, ధృడమైన సంకల్పం , ఖచితత్వంతో కూడుకున్న మెటీరియల్స్ మరియు revision, Online mock test లు ఇలాంటి వాటిని మీ preparation లో భాగం చేసుకుంటే తప్పకుండ ఒక పోస్ట్ మన ఖాతాలో వేయవచ్చు.

SSC CGL ని మొత్తం నాలుగు దశలలో నిర్వహిస్తారు అందులో మొదటి (Tier-I),రెండవ దశ (Tier-II) ని (Computer Based Examination)కంప్యూటర్ ఆదారంగా నిర్వహిస్తారు , అంటే online లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది .మొదటి దశలో మొత్తం 100 మార్కులకు గాను జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు మరియు దివ్యాంగులకు 80 నిమిషాలు కేటాయించడం జరిగింది.ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష హింది మరియు ఇంగ్లీష్ భాషలో ఉంటుంది.

ఇక మొదటి (Tier-I) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి టైర్- II పరీక్ష కి అనుమతిస్తారు ఈ రెండవ దశలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కి కూడా రెండు గంటల సమయం కేటాయించారు .మొదటి పేపర్ (PAPER-I) మొత్తం 200 మార్కులకు గాను PURE MATHEMETICS నుండి 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపు లో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.రెండవ పేపర్ (PAPER-II) లో English Language and Comprehension నుండి 200 మార్కులకు గాను 200 ప్రశ్నలు ఉంటాయి.ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.టైర్- II యొక్క పేపర్ -3 గణాంక మంత్రిత్వ శాఖలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది మరియు Tier-I లో షార్ట్ లిస్టు అవ్వాలి.పేపర్ -3 లో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు నుండి 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. టైర్- II లో, Assistant Audit Officer/ Assistant పోస్టులకు దరాకాస్తూ చేసిన అభ్యర్థులకు మాత్రమే పేపర్- IV ఉంటుంది మరియు Tier-I లో షార్ట్ లిస్టు అవ్వాలి . పేపర్ -4 లో General Studies (Finance and Economics) నుండి 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.

ఇక మొదటి (Tier-I) , రెండవ దశ (Tier-II) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి మొత్తం 100 మార్కులకు మూడో విడత (Tier-III Descriptive Paper) రాతపరీక్ష Descriptive విధానం లో నిర్వహిస్తారు. ఈ పేపర్లో 200-250 పదాల వ్యాసం రాయడం మరియు సుమారు 150-200 పదాల లేఖ / అనువర్తనం ఉంటాయి. .పరీక్ష సమయం 60 నిమిషాలు మరియు దివ్యాంగులకు 80 నిమిషాలు కేటాయించడం జరిగింది.

ఇక Tier-I , రెండవ దశ (Tier-II), మూడో విడత (Tier-III Descriptive Paper) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి కమిషన్ లేదా దాని అధీకృత ఏజెన్సీ అందించిన కంప్యూటర్లు ద్వారా నాలుగవ దశ (Tier-IV ) లో స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. మరియు Document Verification ఉంటుంది పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.

SSC CGL సంబధిత తేదీలు ప్రకటించడం జరిగింది మొదటి దశ పరీక్షలు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లు 29-05-2021 to 07-06-2021 వరకు నిర్వహిస్తారు. ఇందుకోసం అభ్యర్థులకు Shine India 360 BLOG కావాల్సిన అన్ని రకాల ఖచితత్వం తో కూడిన study materials ని మరియు Online Test లను కూడా అందించడం జరుగుతుంది. క్రింద ఇచిన లింక్ ల పై క్లిక్ చేసి మీకు కావాల్సిన విభాగం లోకి వెళ్లి చదవడం ప్రారంభించండి. ప్రతి రోజు కూడా ఈ బ్లాగ్ ని సందర్శిస్తే మీ విజయానికి నాంది అవ్వచు

Syllabus

Preparation Plan

Online Notification

Study materials

Previous and Model Papers

Post a Comment

0 Comments