Ticker

hello

SSC CGL 2020 Recruitment Syllabus || Shine india 360 blog

SSC CGL Syllabus

వాస్తవానికి SSC పరీక్షలకు దరఖాస్తులు కోట్ల సంఖ్యా లలోనే వస్తున్నాయి. పోటీ చాల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు పక్కా ప్రణాళికతో సిద్దమవ్వాలి. Central Govt కొలువు లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఒక క్రమ పద్ధతి లో చదవడం అలవాటు చేసుకోవాలి, అందు కోసం పరీక్షా విధానం గురించి ముందుగా తెలుసుకోవాలి. అంటే ఎన్ని పేపర్లు, ఏఏ సబ్జెక్టులు, ఎన్ని మార్కులు, పరీక్షా సమయం, ఆబ్జెక్టివ్ విధానమా, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుందో లేదో తెలుసుకొని దానికి అనుగుణంగా సిద్ధమవ్వాలి. అలాగే పరీక్ష దశలను, పరీక్షా విధానం, ఎన్ని సబ్జెక్టులు, ఎంత సిలబస్ ఉందో తెలుసుకోవాలి.

ఇందులో భాగంగా ఇక్కడ మీరు పరీక్ష కి సంభందించిన సిలబస్ ని చూడవచు .

Tier-1

పరీక్ష విధానం:

పరీక్ష 4 దశలలో నిర్వహిస్తారు

  1. Tier-I
  2. Tier-II
  3. Tier-III
  4. Tier-IV

Tier-I

మొదటి (Tier-I),రెండవ దశ (Tier-II) ని (Computer Based Examination)కంప్యూటర్ ఆదారంగా నిర్వహిస్తారు , అంటే online లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది .మొదటి దశలో మొత్తం 100 మార్కులకు గాను జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు మరియు దివ్యాంగులకు 80 నిమిషాలు కేటాయించడం జరిగింది.ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష హింది మరియు ఇంగ్లీష్ భాషలో ఉంటుంది.

Tier-II

ఇక మొదటి (Tier-I) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి టైర్- II పరీక్ష కి అనుమతిస్తారు ఈ రెండవ దశలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కి కూడా రెండు గంటల సమయం కేటాయించారు .మొదటి పేపర్ (PAPER-I) మొత్తం 200 మార్కులకు గాను PURE MATHEMETICS నుండి 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపు లో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.రెండవ పేపర్ (PAPER-II) లో English Language and Comprehension నుండి 200 మార్కులకు గాను 200 ప్రశ్నలు ఉంటాయి.ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.టైర్- II యొక్క పేపర్ -3 గణాంక మంత్రిత్వ శాఖలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది మరియు Tier-I లో షార్ట్ లిస్టు అవ్వాలి.పేపర్ -3 లో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు నుండి 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. టైర్- II లో, Assistant Audit Officer/ Assistant పోస్టులకు దరాకాస్తూ చేసిన అభ్యర్థులకు మాత్రమే పేపర్- IV ఉంటుంది మరియు Tier-I లో షార్ట్ లిస్టు అవ్వాలి . పేపర్ -4 లో General Studies (Finance and Economics) నుండి 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.

Tier-III

ఇక మొదటి (Tier-I) , రెండవ దశ (Tier-II) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి మొత్తం 100 మార్కులకు మూడో విడత (Tier-III Descriptive Paper) రాతపరీక్ష Descriptive విధానం లో నిర్వహిస్తారు. ఈ పేపర్లో 200-250 పదాల వ్యాసం రాయడం మరియు సుమారు 150-200 పదాల లేఖ / అనువర్తనం ఉంటాయి. .పరీక్ష సమయం 60 నిమిషాలు మరియు దివ్యాంగులకు 80 నిమిషాలు కేటాయించడం జరిగింది.

Tier-IV

ఇక Tier-I , రెండవ దశ (Tier-II), మూడో విడత (Tier-III Descriptive Paper) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి కమిషన్ లేదా దాని అధీకృత ఏజెన్సీ అందించిన కంప్యూటర్లు ద్వారా నాలుగవ దశ (Tier-IV ) లో స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. మరియు Document Verification ఉంటుంది పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.

SSC CGL సంబధిత తేదీలు ప్రకటించడం జరిగింది మొదటి దశ పరీక్షలు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లు 29-05-2021 to 07-06-2021 వరకు నిర్వహిస్తారు. ఇందుకోసం అభ్యర్థులకు Shine India 360 BLOG కావాల్సిన అన్ని రకాల ఖచితత్వం తో కూడిన study materials ని మరియు Online Test లను కూడా అందించడం జరుగుతుంది.

సిలబస్:

సిలబస్ కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

SSC CGL SYLLABUS

Post a Comment

0 Comments