Ticker

hello

SSC CHSL Recruitment 2020 Study material , Syllabus , Preparation Plan | Shine india 360

SSC CHSL SHINE INDIA 360

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డిసి) / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జెఎస్ఎ), పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్ నియామకాలకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10 + 2) పరీక్ష 2020 నిర్వహించడానికి నోటిఫికేషన్ ప్రకటించింది.Intermediate అర్హత కలిగి ఉండి నిర్దిష్టమైన ప్రణాలిక, ధృడమైన సంకల్పం , ఖచితత్వంతో కూడుకున్న మెటీరియల్స్ మరియు revision, Online mock test లు ఇలాంటి వాటిని మీ preparation లో భాగం చేసుకుంటే తప్పకుండ ఒక పోస్ట్ మన ఖాతాలో వేయవచ్చు.

SSC CHCL ని మూడు దశలలో నిర్వహిస్తారు అందులో మొదటి దశ (Tier-I) ని (Computer Based Examination)కంప్యూటర్ ఆదారంగా నిర్వహిస్తారు , అంటే online లో ఉంటుంది . ఈ దశలో మొత్తం 100 మార్కులకు గాను జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు మరియు దివ్యాంగులకు 80 నిమిషాలు కేటాయించడం జరిగింది.ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష హింది మరియు ఇంగ్లీష్ భాషలో ఉంటుంది.

ఇక మొదటి (Tier-I) , రెండవ దశ (Tier-II) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి మొత్తం 100 మార్కులకు రెండో విడత (Tier-II Descriptive Paper)రాతపరీక్ష Descriptive విధానం లో నిర్వహిస్తారు. ఈ పేపర్లో 200-250 పదాల వ్యాసం రాయడం మరియు సుమారు 150-200 పదాల లేఖ / అనువర్తనం ఉంటాయి. టైర్ -2 లో కనీస అర్హత మార్కులు 33 శాతం ఉంటాయి.పరీక్ష సమయం 60 నిమిషాలు మరియు దివ్యాంగులకు 80 నిమిషాలు కేటాయించడం జరిగింది.

ఇక Tier-I , రెండవ దశ (Tier-II) లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి కమిషన్ లేదా దాని అధీకృత ఏజెన్సీ అందించిన కంప్యూటర్లు ద్వారా Tier-III లో స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.

SSC CHSL సంబధిత తేదీలు ప్రకటించడం జరిగింది మొదటి దశ పరీక్షలు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లు 12-04-2021 నుండి 27-04-2021 వరకు నిర్వహిస్తారు. ఇందుకోసం అభ్యర్థులకు Shine Indai 360 కావాల్సిన అన్ని రకాల ఖచితత్వం తో కూడిన study materials ని మరియు Online Test లను కూడా అందించడం జరుగుతుంది. క్రింద ఇచిన లింక్ ల పై క్లిక్ చేసి మీకు కావాల్సిన విభాగం లోకి వెళ్లి చదవడం ప్రారంభించండి. ప్రతి రోజు కూడా ఈ బ్లాగ్ ని సందర్శిస్తే మీ విజయానికి నాంది అవ్వచు

Syllabus

Preparation Plan

Online Notification

Study materials

Previous and Model Papers

Post a Comment

0 Comments