Ticker

hello

SSC CGL 2020 Preparation Plan In Telugu

SSC CGL 2020 Preparation Plan In Telugu :

సెంట్రల్ గౌవేర్న్మేంట్ లో జాబు కొట్టడం అనేది ప్రతి ఒక్కరి కల, ఎంతో మంది పోటి పడే ఇలాంటి జాబ్స్ కి నిర్దిష్టమైన ప్రణాళిక , కస్టపడడంతో పాటు smart study ని అలవరుచుకోవడం ఎంతో ముఖ్యం. smart study అంటే ఏంటో నేను చివరిలో వివరణ ఇస్తాను. మున్దుగా ఇక్కడ preparation plan కి సంబంధించి ముఖ్యమైన విషయాలు చూదాం.

  • సిలబస్ మరియు పరీక్షల సరళి
  • టైం టేబుల్
  • బుక్స్ సెలెక్షన్స్
  • సొంత నోట్స్
  • రివిసన్
  • ప్రాక్టీసు
  • స్మార్ట్ స్టడీ/ Time management

సిలబస్ మరియు పరీక్షల సరళి:

ఎటువంటి పరీక్ష రాయాలన్న.. పరీక్షా విధానం గురించి ముందుగా తెలుసుకోవాలి. అంటే ఎన్ని పేపర్లు, ఏఏ సబ్జెక్టులు, ఎన్ని మార్కులు, పరీక్షా సమయం, ఆబ్జెక్టివ్ విధానమా, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా సిద్ధమవ్వాలి. అలాగే పరీక్ష దశలను, పరీక్షా విధానం, ఎన్ని సబ్జెక్టులు, ఎంత సిలబస్ ఉందో తెలుసుకోవడం చాల ఆవష్యఖం.సిలబస్ లో భాగంగా ssc పరీక్షల్లో సాధారణంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ వంటి అంశాలు ఉంటాయి.పూర్తి వివరాలకు SSC CGL SYLLABUS ని చూడండి ఆయా సబ్జెక్టుల సబ్ టాపిక్స్ను సైతం గుర్తించి ముఖ్యమైన వాటిపై ఎక్కువగా దృష్టిపెట్టి చదవాలి. అందుకోసం పాత ప్రశ్న పత్రాలు ఉపయోగపడతాయి.

టైం టేబుల్..

ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలనుకున్నా..ముందుగా టైమ్టేబుల్ను తయారు చేసుకోవడం వలన ఎలాంటి ఆందోళన లేకుండా సమయానికి సిలబస్ పూర్తి చేయడానికి దోహదం పడుతుంది. కొంత మంది టైం టేబుల్ తయారు చేసుకుంటారు దానిని గోడలకే పరిమితం చేస్తారు అందుకే వాళ్ళకి విజయం దరి చేరదు, తర్వాతా టైం టేబుల్ యొక్క విలువ ఏంటో తెల్సి వస్తది, పోటి పరీక్షలలో విజయం పొందాలంటే టైం టేబుల్ తయారు చేసుకోవడం మరియు అనుసరించడం ఎంతో ముఖ్యం .ప్రతి రోజూ కనీసం ఎనిమిది గంటలు చదవాలి.ప్రిపరేషన్కు సమయం కేటాయించినట్లే.. విశ్రాంతికి కొంత సమయం కేటాయించుకోవాలి.మంచి ఆహరం తీసుకుంటూ మంచినీళ్ళు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.

పుస్తకాల ఎంపిక..

SSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కచితత్వం ఉన్న ప్రామాణికామిన పుస్తకాలను ఎంచుకొని వాటినే చదువుతూ ఉండాలి. మార్కెట్స్ లో దొరికే ప్రతి నోట్స్ చదవాలనే ఆత్రుత ని తగ్గించుకోవాలి మీకు కావాల్సిన కచితత్వం తో కూడిన నోట్స్ మాత్రం సేకరణ చేసుకోవడం మంచిది. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజూ తప్పకుండా వార్తాపత్రికలను, వీలుంటే నెలవారీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లను చదవడం మంచిది.మన షైన్ ఇండియా 360 అన్నిటిని కలిపి ఖచితత్వంతో కూడుకున్న నోట్స్ , కరెంటు అఫైర్స్ ని అందిస్తుంది.పదో తరగతి వరకు ఉన్న ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఎంచుకొని వాటినే చదువుతూ ఉండాలి.

సొంత నోట్స్..

చాల మంది పోటి పరీక్షల్లో విజయం సాధించిన వాళ్ళు చెప్పిన మొదటి మాట సొంత నోట్స్ తాయారు చేసుకోవడం, సిలబస్ను పూర్తి చేసేటప్పుడు తమకు తామే సొంత నోట్స్ను తయారు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద విషయాలు కఠినంగా ఉండే వాటిని గుర్తించుకోవడానికి ఒక చిన్న కథలాగ, కోడ్ రూపంలో సొంతంగా నోట్స్ రాసుకోవడం వాళ్ళ ఎంతో మేలు చేస్తుంది.ఏదైనా ఒక చాప్టర్ చదవడం అయ్యాక అందులోని ముఖ్య విషయాలను టేబుల్ రూపంలో క్విక్ లెర్న్ తాయారు చేసుకోవడం చాల మంచిది

రివిసన్..

పరీక్షల్లో విజయం సాదించాలంటే ఈ భాగం చాల ముఖ్యమైంది. ఎందుకంటే ఇప్పటిదాకా చదవడం ఒక ఎతైతే చదివింది గుర్తు పెట్టుకోవడం అంత ముఖ్యం, చదువుకు ఇంత లిమిట్ అని ఉండదు కావున మనమే లిమిట్ పెట్టుకొని మరల తిరిగి రివిసన్ చేయడం చాల ముఖ్యం

ప్రాక్టీస్ చేయాలి..

SSC CGL లో negitive మార్క్స్ ఉన్నందున మరియు సమయ భావం చాల ముక్యం అందుకోసం ప్రాక్టీసు పేపర్స్ ని మరియు గతం లో ఇచిన ప్రశ్న పత్రాలను తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే మోడల్ ప్రశ్నలను క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయం దక్కించుకోవడం మన సొంతం అవుతుంది. జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నపుడు దానిని సాధించడానికి నిర్దిష్టమైన ప్రణాళిక తో పట్టుదలతో కృషిచేయాలి. షైన్ ఇండియా 360 డైలీ మోక్ టెస్ట్ లను అందిస్తుంది.

Smart Study..

Smart Study అంటే time management ఏదైనా పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే.. టైమ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతమున్న పోటీని ఎదుర్కోవాలంటే.. కష్టపడి చదవడం కన్నా స్మార్ట్గా చదవడం వలన విజయం సొంతం చేసుకోవచు. సిలబస్ను వేగంగా అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు టైమ్ మేనేజ్మెంట్ చాల ఉపయోగ కరంగా ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన సమయ పాలన వల్ల అనేకసార్లు రివిజన్ చేయడానికి ఈ టైమ్ మేనేజ్మెంట్ చాల ఉపయోగ కరంగా ఉంటుంది. షైన్ ఇండియా 360 blog మీకు అన్ని విధాల ఉపయోగ పడుతుంది మీ preparation కోసం అన్ని రకాల స్టడీ materials మరియు కరెంటు అఫైర్స్ ని అందిస్తుంది.

చివరగా పరీక్ష కి ఇంకా సమయం ఉన్నందున నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదివితే విజయం మన సొంతం చేసుకోవచు.

మనకు అవగాహన , పట్టుదల లేని సబ్జెక్ట్ చదివేటప్పుడు తెలిసిన వారితో group discussions చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఒక్కో రోజూ ఒక సబ్జెక్టు కాకుండా రోజు ప్రతీ సబ్జెక్ట్ మీద శ్రద్ధ చూపడం తప్పనిసరి.

Negitive మార్కులు ఉన్నందున పరీక్ష రాసేటప్పుడు చాల జాగ్రతగా తెలిసిన దానిని మాత్రమే జవాబుగా గుర్తించాలి.

పైన తెలిపిన సబ్జెక్టులన్నీ చదివిన తర్వాత పునశ్చరణ చేయడం మరియు ఎన్ని ఎక్కువ మాదిరి పేపర్లు ప్రాక్టీసు చేయడం వలన లాభం చేకుతుతుంది

Exam Hall లో OMR పత్రం నింపేటప్పుడు పర్యవేక్షకుని సలహా తీసుకుంటే తప్పులు పోయే అవకాశం ఉండదు.

Post a Comment

0 Comments